భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 13 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది… పోలీసులు-మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన భీక‌ర ఎదురు కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు ప్రాణాలు వ‌దిలారు.. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.. మృతిచెందిన 13 మంది మావోయిస్టులు కసనాసూర్ ద‌ళానికి చెందిన‌వారికిగా గుర్తించారు.. ఇందులో.. ఏడుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్న‌ట్టుగా తేల్చారు పోలీసులు.. ఘ‌ట‌నా స్థలంలో ఎస్సెల్ ఆర్,ఏకే 47,303 ,12 బోర్ రైఫిల్ , ఇత‌ర మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు.. మ‌రో ఐదు మంది గాయ‌ప‌డి ఉంటార‌ని పోలీసులు చెబుతున్నారు.. సీ-60 బెటాలియన్‌కు చెందిన పోలీసులు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుప‌డ‌డంతో.. ఇద్ద‌రి మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయ‌ని చెబుతున్నారు.

-Advertisement-భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 13 మంది మావోయిస్టులు మృతి

Related Articles

Latest Articles