క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌… బెంగ‌ళూరులో రికార్డ్ స్థాయిలో…

క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  తాజాగా క‌ర్ణాట‌క‌లో 12 వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 9020 కేసులు బెంగ‌ళూరు న‌గ‌రంలోనే న‌మోద‌వ్వ‌డం విశేషం.  శ‌నివారం రోజున బెంగ‌ళూరులో 7118 కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  క‌ర్ణాట‌క‌లో ప్రస్తుతం 49,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.33 శాతం ఉన్న‌ట్టు క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  రోజువారి కేసులు పెరుగుతుండ‌టంతో క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తం అయింది.  ఇప్ప‌టికే రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  

Read: లైవ్‌: బంగార్రాజు మ్యూజిక‌ల్ నైట్‌

విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు.  హోట‌ళ్లు, సినిమా థియేట‌ర్లు, బార్లు, రెస్తారెంట్లు 50 శాతం సీటింగ్‌లో న‌డుస్తున్నాయి.  క‌రోనా తీవ్ర‌త  కార‌ణంగా బీద‌ర్‌లో ఈరోజు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే.  మాస్క్ ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రిస్తూ, నిబంధ‌న‌లు పాటిస్తే క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కార‌ణంగానే కేసులు పెరుగుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  ఇక రేప‌టి నుంచి రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిని వారికి, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు బూస్ట‌ర్ డోసులు అందించ‌నున్నారు.  

Related Articles

Latest Articles