జూన్‌లో అందుబాటులోకి 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు…

క‌రోనా మ‌హ‌మ్మారి ఆట క‌ట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్యక్ర‌మం జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 21 కోట్ల‌మందికి వ్యాక్సిన్ అందించారు.  మే నెల‌లో రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసుల‌ను అందుబాటులో ఉంచ‌గా, జూన్ నెల‌లో 12కోట్ల డోసుల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసుల‌ను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌నుండ‌గా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేక‌రించేందుకు అందుబాటులో ఉంచింది.  జ‌నాభ‌, వ్యాక్సిన్ డోసుల వృధాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వ్యాక్సిన్ డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-