ఇండియాలో మళ్ళీ 10 వేలు దాటినా కరోనా కేసులు…

ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో 10,549 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 488 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,39,77,830 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,67,468 మంది మృతి చెందారు. దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,20,27,03,659 కోట్ల మందికి టీకాలు వేశారు.

Related Articles

Latest Articles