ఒలింపిక్స్ లో టీ10 క్రికెట్ పెట్టాలి : మోర్గాన్

ప్రపంచం లో ఫుట్ బాల్ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆట అంటే క్రికెట్. అయితే అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలి అని కామెంట్స్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు. ప్రస్తుతం అబుదాబి లో జరుగుతున్న టీ 10 లీగ్‌ లో ఢిల్లీ బుల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… మోర్గాన్ ఒలంపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలి అని అన్నారు. క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి ఒలింపిక్స్ ఒక గొప్ప అవకాశం అని చెప్పాడు. టీ10 క్రికెట్ ను అభిమానులు ఆస్వాదిస్తారు.

నేను ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలను తీసుకురావడానికి.. అలాగే క్రికెట్ మరింత పెద్దదిగా ఎదగడానికి ప్రయత్నిస్తాను. అందుకు ఒలంపిక్స్ ఒక మంచి అవకాశం అని తెలిపాడు. అయితే ఐపీఎల్ లో మోర్గాన్ కెప్టెన్సీ వహించే కేకేఆర్ ఈ ఏడాది జరిగిన సీజన్ లో ఫైనల్స్ వరకు చేరుకొని.. అక్కడ చెన్నై చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles