105 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు సృష్టించిన బామ్మ

జీవితంలో 105 ఏళ్లు బతికి ఉండటమే గగనం. అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలా? సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సహాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్భుతమే. ఇంకా పరుగుపందెంలో పాల్గొనడం అంటే మాములు మాటలు కాదు. అయితే ఓ బామ్మ మాత్రం అద్భుతాన్ని సుసాధ్యం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన బుట్టలో వేసుకుంది.

Read Also: ఆస్ట్రేలియాలో మహాత్ముడికి అవమానం

యూఎస్‌కు చెందిన 105 ఏళ్ల జులియా హాకిన్స్ అనే బామ్మ రిటైర్డ్ టీచర్. అయితే తనకు 101 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చేయడం ప్రారంభించింది. 80 ఏళ్ల వయసులో నేషనల్ సీనియర్ గేమ్స్‌లో పాల్గొనడంతో.. ఆ అనుభవాన్ని ఉపయోగించి పరుగెత్తేది. ఇటీవల 100 మీటర్ల స్ప్రింటింగ్ పోటీల్లో పాల్గొని కేవలం నిమిషం రెండు సెకన్‌ల వ్యవధిలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ప్రపంచంలో ఈ ఫీట్ పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా జులియా హాకిన్స్ చరిత్ర సృష్టించింది.

Related Articles

Latest Articles