ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక‌: ఢిల్లీలో నేడు 10వేల క‌రోనా కేసులు?

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  పాజిటివిటి రేటు మంగ‌ళ‌వారం రోజున 8.3గా న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  సోమ‌వారం రోజున పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉన్న‌ది.  దీనిని బేస్ చేసుకొని ఈరోజు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని, 10 వేల‌కు పైగా కేసులు న‌మోదుకావొచ్చ‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర‌జైన్ తెలిపారు.  ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు.  దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయింద‌ని, పెరుగుతున్న కేసులో ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.  ఇండియాలో థ‌ర్డ్ వేవ్ న‌డుస్తుంటే, ఢిల్లీలో ఐదో వేవ్ న‌డుస్తోంద‌ని తెలిపారు. కేసుల‌ను క‌ట్టిడి చేసుందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు.

Read: తెలంగాణలో భూప్రకంపనలు.. ఆ 2 జిల్లాల్లో పరుగులు పెట్టిన ప్రజలు..!

పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. టెస్టుల సంఖ్య‌ను ఇప్ప‌టికే పెంచామ‌ని మంత్రి తెలిపారు.  ఎలాంటి విప‌త్తు వ‌చ్చినా స‌మ‌ర్థ‌వంతంగా ఎద‌ర్కొనేందుకు అన్ని ఏర్పాట్ల‌ను సిద్ధం చేసుకున్నామ‌ని, ఆసుప‌త్రుల్లో కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని, ఆక్సీజ‌న్‌, బెడ్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్న‌ట్టు స‌త్యేంద్ర‌జైన్ తెలిపారు.  ఇప్ప‌టికే స్కూళ్ల‌ను, సినిమా హాళ్ల‌ను, జిమ్‌ల‌ను, పార్కుల‌ను మూసివేశారు.  ప్రార్థ‌నా మందిరాల్లోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు.  వేడుక‌ల‌ను ప‌రిమితితో కూడిన అనుమ‌తులు ఇస్తున్నారు.  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటినుంచి ప‌నిచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.  రెస్టారెంట్లు, బార్లు, మెట్రోలు 50 శాతం సీటింగ్‌తోనే న‌డిచేలా ఆదేశాలను జారీ చేసింది ఢిల్లీ స‌ర్కార్‌.

Related Articles

Latest Articles