వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ నేత రణబీర్‌ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న హర్యానాలోని సిర్సా జిల్లాలో ఆందోళన నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. మొదట రైతులపై దేశద్రోహంతో పాటు హత్యాయత్నం కింద అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. రైతు సంఘాల నేతలు హర్‌చరన్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పేర్లు ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చారు.. అయితే, తాజాగా వంద మంది రైతులపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్టు రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, సెక్షన్ 124-ఏపై తాజాగా స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. సెక్షన్‌ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని.. కొయ్యను మలిచే రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్లుంది.. అంటూ వ్యాఖ్యానించిన కొన్ని గంట్లోనే ఈ కేసులు వెలుగు చూశాయి.. హర్యానాలోని రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వ సూచనల మేరకు రైతులు మరియు రైతు నాయకులపై తప్పుడు, పనికిరాని ఆరోపణలతో దేశద్రోహ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు రైతు సంఘాల నేతలు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-