హృతిక్, కత్రీనాతో సహా ‘జిందగీ నా మిలేగీ దుబారా’ టీమ్ ‘10 ఏళ్ల’ సంబరాలు!

జోయా అఖ్తర్ దర్శకత్వంలో ఫర్హాన్ అఖ్తర్, హృతిక్ రోషన్, అభయ్ డియోల్ హీరోలుగా రూపొందింది ‘జిందగీ నా మిలేగీ దుబారా’. విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సక్సెస్ ఫుల్ మల్టీ స్టారర్. ఆ సందర్భంగా మూవీలో భాగమైన వారంతా ఆన్ లైన్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. హృతిక్, అభయ్, ఫర్హాన్ తో పాటూ కత్రీనా కైఫ్ కూడా గెట్ టు గెదర్ లో కనిపించింది. ‘జిందగీ నా మిలేగీ…’ డైరెక్టర్ జోయా అఖ్తర్ చిత్రం రూపొందించినప్పటి అనుభవాలు నెమర వేసుకుంది. కత్రీనాతో పాటూ మూవీ హీరోలు ముగ్గురు కూడా అప్పటి జ్ఞాపకాలు నెటిజన్స్ తో పంచుకున్నారు.

‘జిందగీ నా మిలేగీ… ‘ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ యూనియన్ లో పాల్గొన్న వారంతా సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరపై చదివి వినిపించారు. స్క్రీప్ట్ లోని ఇంపార్టెంట్ సీన్స్ ని రీడవుట్ చేస్తూ… అవి షూట్ చేసినప్పటి వివరాలు, విశేషాలు ప్రేక్షకులకి అందించారు! ఫర్హాన్ అఖ్తర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ‘జిందగీ నా మిలేగీ దుబారా’ రీ యూనియన్ వీడియో పోస్ట్ చేశాడు…

View this post on Instagram

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-