ఏడాది పూర్తి చేసుకున్న నాని “వి”

న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్‌లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. ఇది ఒక సీరియల్ కిల్లర్‌ అంతు చూడడానికి ఒక పోలీస్ చేసే ప్రయత్నం. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ సినిమాలోని సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Read also : రివ్యూ : ‘మనీ హేస్ట్’ సీజన్ 5 పార్ట్ 1

మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సౌండ్‌ట్రాక్ స్వరపరిచగా, థమన్ సంగీతం అందించారు. “వి” చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో గత ఏడాది 5 సెప్టెంబర్లో విడుదలైంది. టాలీవుడ్ లో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. 2020 లో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమా కూడా “వి”.

ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వం వహించిన “టక్ జగదీష్” విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా ఓటిటిలోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 10న “టక్ జగదీష్” అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-