‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ టీజర్ కు 1 మిలియన్ వ్యూస్…!

స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. నిన్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ టీజర్ 1 మిలియన్ వ్యూస్ ను దాటేయడం విశేషం. సరికొత్త కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

Related Articles

Latest Articles

-Advertisement-