‘కేజీఎఫ్’ చాప్టర్ 2 టీజర్ సరికొత్త రికార్డు…!

‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘కేజీఎఫ్2’ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దసరాకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ సినిమా టీజర్ విడువులై 4 నెలలు గడిచిపోయినా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 69 మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ టీజర్ కు 188 మిలియన్ల వ్యూస్, 8.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. తాజాగా ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 టీజర్ ఈ టీజర్ 1 మిలియన్ కామెంట్స్ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. టీజర్ కే ఇలాంటి స్పందన వస్తే సినిమా విడుదలయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-