‘సలార్’ కు భారీ డీల్.. కానీ ఆయన రెమ్యునరేషన్ కే సరిపోవట!

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్‌ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై గాసిప్స్ వార్తలు ఎక్కువే అవుతున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తంలో ఆఫర్ చేసారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్లకు ప్రైమ్ ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సాధ్యమైయ్యే ముచ్చట్లు చెప్పితే బాగుంటుందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. సలార్ సినిమా 100 కోట్లకు పైనే బడ్జెట్ అవుతుందంటున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం 100 కోట్లకు దగ్గరలో ఉందని, ఆయన పారితోషకానికి కూడా అవి సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది అమెజాన్ ప్రైమ్ 300 కోట్ల మేర ఆఫర్ చేసిన ఆలోచించే ప్రసక్తే లేదని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-