శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్-గోపి సినిమా!

శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమా గురించి దర్శకులు  వివరాలు తెలియచేస్తూ ”మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. ఇదివరకు హీరో తరుణ్ తో “ఇది నా లవ్ స్టోరీ”,  ఆ తరువాత “రెడ్డి గారింట్లో రౌడీయిజం” తీసాము,  అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేసాము, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇది మా నాలుగో సినిమా.  ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తున్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్సు ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే .. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం” అని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-