శంకర్ దాదా సినిమా చూపిస్తున్న నక్షత్ర ఆస్పత్రి

ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది.

జ్వరంతో వచ్చిన వ్యక్తిని ఇన్సురెన్స్ ఉందని అందిన కాడికి దోచుకోవచ్చని నక్షత్ర ఆస్పత్రి డాక్టర్లు పధకం వేశారు. జాయిన్ అయిన రెండో రోజే నాకు ఆరోగ్యం బాగుంది.. డిశ్చార్జ్ చేయమంటే ఇన్సురెన్స్ క్లెయిమ్ అయ్యాక చూద్దామన్నది యాజమాన్యం.. ట్రీట్మెంట్ కి రెండు రోజులకు 16 వేలు అయితే లక్షరూపాయలకు ఎలా క్లెయిమ్ చేస్తారంటూ ఇన్సూరెన్స్ సంస్ధ క్లెయిమ్ రిజెక్ట్ చేసింది.

దీంతో ఇన్సూరెన్స్ సంస్ధ డబ్బులు ఇవ్వడం లేదు నువ్వే లక్ష రూపాయలు కట్టాలంటూ పేషంట్ కు బెదిరింపులు చేసింది నక్షత్ర ఆస్పత్రి యాజమాన్యం.. లక్ష కట్టకపోవడంతో డిశ్చార్జ్ చేయకుండా పేషంట్ ను నక్షత్ర ఆస్పత్రి వేధిస్తోంది. కరోనా వచ్చింది రెమిడెసివర్ ఇంజెక్షన్లు ఇచ్చామని ఇన్సురెన్స్ సంస్ధకు నక్షత్ర ఆస్పత్రి లక్షల క్లెయిమ్ పెట్టింది.

నాకు ఒక్క ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదని పేషంట్ మొత్తుకుంటుంది.. చివరికి రాజీకి వచ్చిన డాక్టర్లు నీకు మేము ఇంజెక్షన్ ఇవ్వలేదు, కానీ ఇన్సూరెన్స్ వారికి మాత్రం ఇచ్చినట్లు చెప్పమని పేషంట్ కు డాక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. నాకు ఇవ్వని ట్రీట్మెంట్ కు నేనెలా చెప్తానని పేషంట్ మొండికేసింది. చెకింగ్ కి వచ్చిన ఇన్సూరెన్స్ సంస్ధకి ఆ పేషంట్ “శంకర్ దాదా సీన్” వివరించింది.

Related Articles

Latest Articles

-Advertisement-