వెట్రిమారన్ తో జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా!?

జాతీత అవార్డు పొందిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. తమిళంలో ‘పొల్లాదవన్, ఆడుకాలం, విచారణై, వాడా చెన్నై, అసురన్’ వంటి పలు హిట్స్ అందించిన వెట్రిమారన్ వద్ద ఓ ప్రత్యేకమైన కథ ఉందట. ఈ కథ కోసం తెలుగులో నటించే అగ్రహీరోల గురించి ఎదురు చూస్తున్నాడట. దీనిని ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించాడట. జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ ఓకె అంటే తెలుగులో వెట్రిమారన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తాడన్నమాట.

వెట్రిమారన్ రివెంజ్ డ్రామా ‘అసురన్‌’ తో ధనుష్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీనిని వెంకటేశ్ తెలుగులో ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వెట్రిమారన్ సినిమా అంటేనే అవార్డులకు పెట్టింది పేరు. ఒక వేళ ఎన్టీఆర్ వెట్రిమారన్ కి ఓకె చెబితే తప్పకుండా ఆయన అభిమానులు జాతీయ అవార్డు ఆశించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో!

Related Articles

Latest Articles

-Advertisement-