లాక్​డౌన్ ఎఫెక్ట్:​ యూట్యూబ్​ చూసి ఇంట్లోనే మద్యం తయారు.. అరెస్ట్

తమిళనాడులోని కరూర్​ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్​తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారి నుంచి 8 లిక్కర్​ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాము తాగేందుకే తయారీ ప్రారంభించమని తెలిపారు. మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నామని పోలీస్ ఎంక్వైరీలో తెలిపారు. అంతేకాదు, యూట్యూబ్​ వీడియో చూసి వారు ఆల్కహాల్​ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఈమేరకు ఆ తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. లాక్ డౌన్ సమయంలో స్వయంగా మద్యం తయారు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని పోలీసులు తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-