‘రిపబ్లిక్’ నుంచి మరో సాంగ్ వచ్చింది.. ‘మహాసముద్రం’ రష్మిక మెచ్చింది

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి – సాకీ శ్రీనివాస్ – బరిమిశెట్టి కలసి ఆలపించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహాసముద్రం: ‘చెప్పకే చెప్పకే’ సాంగ్ మెచ్చిన రష్మిక

యంగ్ టాలెంటెడ్ హీరోలు శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే’ అనే మెలోడీ గీతాన్ని బ్యూటీ రష్మిక మందన్నా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేస్తూ.. ఆల్ ది బెస్ట్ తెలిపింది. ‘ఈ ఫీల్ గుడ్ ప్రేమ పాట నాకు బాగా నచ్చింది. శర్వా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా చూపించారు. అందరూ బాగా నటించారు’ అంటూ రష్మిక పేర్కొంది. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-