రవీందర్ సింగ్‌పై కరీంనగర్ మేయర్ ఫైర్

కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై ధ్వజమెత్తారు. రవీందర్ సింగ్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. రవీందర్ సింగ్ అవకాశవాద రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడన్నారు సునీల్ రావు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా అంశం ఆయన నైతికతకే వదిలేస్తున్నాం. గత సంవత్సర కాలంగా 2023లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నది నిజం కాదా? ఏ ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో అవకాశం కావాలి అనడం అత్యాశ.

పార్టీ అధిష్టానం ఎప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలో చూసుకుంటుంది. బీజేపీ కార్పొరేటర్ తో కాంగ్రెస్ పార్టీ వాళ్లతో సపోర్ట్ తీసుకున్నారో అప్పుడే టి ఆర్ యస్ కు ద్రోహం చేశావు. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరూ పనిచేయలేదా? పార్టీని కించపరిచే పనులు చేసావు. రవీందర్ సింగ్ కు ఐదు సంవత్సరాలు మేయర్ గా పనిచేసే అవకాశం పార్టీ ఇచ్చింది. టీఆర్‌యస్ అధిష్టానం ను ఎప్పుడు అయితే ధిక్కరించినవో అప్పుడే నువ్వు టీఆర్ఎస్‌కు దూరం అయ్యావన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ గా రవీందర్ సింగ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles