యువతిపై ప్రేమోన్మాది దాడి.. స్నేహితుడు అడ్డుకోవడంతో..?

ఎన్నో రకాల కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేష్మా అనే యువతిని సందీప్ కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించడం లేదని సందీప్ దాడికి పాల్పడ్డాడు. అయితే సందీప్ వెంట వచ్చిన తన స్నేహితుడు గోవిందు దాడిని అడ్డుకోవడంతో రేష్మా ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం తన కుటుంబసభ్యులకు చెప్పడంతో ఉన్మాదిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు తల్లిదండ్రులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ ని అదుపులోకి తీసుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-