‘మా’ఓటర్లకు ధన్యవాదాలు.. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించారు..

ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. “మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికీ శుభాకాంక్షలు.. తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు.. అంటూ ప్రకాష్‌రాజ్‌పై సెటైర్లు వేశారు.

ఇక, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌.. “మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు.. మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు.. అందరికి అభినందనలు.. భారత్ మాతాకి జై ! అంటూ ట్వీట్‌ చేశారు సంజయ్.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యతిరేకించారు ప్రకాష్‌ రాజ్.. మా ఎన్నికల సమయంలోనూ ప్రకాష్‌ రాజ్‌ జాతి వ్యతిరేక శక్తి అనే ఆరోపణలు, విమర్శలు చేశారు చేశారు.. ఇప్పుడు.. తన ట్వీట్‌లో బండి సంజయ్‌ అదే ప్రస్తావన చేశారు.

-Advertisement-'మా'ఓటర్లకు ధన్యవాదాలు.. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించారు..

Related Articles

Latest Articles