మళ్లీ ‘మల్లీశ్వరి’… డేటింగ్ విషయంలో డేరింగ్ చేస్తుందా?

ఆమెకు 37… అతనికి 33… అయితేనేం, ఆ జూనయర్ అందగాడు సీనియర్ సుందరిని పడేశాడు. ఇద్దరూ కలసి రొమాంటిక్ డేట్స్ కానిచ్చేస్తున్నారు. అయితే, ఇక ఇప్పుడు ఆ హీరో, హీరోయిన్ మనకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నారట! అఫ్ కోర్స్, ఇంత చెప్పాక ఆ ఇద్దరు లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ అండ్ కత్రీనా అని అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి? ప్రస్తుతం బీ-టౌన్ లో కాక రేపుతోన్న స్టార్ కపుల్ వీరిద్దరే!
విక్కీతో క్యాట్ నడుపుతోన్న లవ్ స్టోరీ కొత్తదేం కాదు. చాలా రోజులుగా మీడియా వాళ్లు, ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాలు వీర్ని అనుమానంగానే చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మల్లీశ్వరి’ తన మనసుదోచిన వాడి పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతోందని ముంబై టాక్. ఇంత వరకూ ఒకటి, రెండు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయటం, డిలీట్ చేయటం లాంటి పనులు చేశారు లవ్ బర్డ్స్. అయితే, ఎవరు ఎంతగా ట్రోలింగ్ చేసినా నోరు మెదపలేదు. కానీ, లాక్ డౌన్ లో ఏమైందో ఏమోగానీ విక్కీ అండ్ కత్రీనా మనసు మార్చుకున్నారట. త్వరలోనే ఓ సొషల్ మీడియా పోస్ట్ ద్వారా తమ రిలేషన్ షిప్ అనౌన్స్ చేయవచ్చు అంటున్నారు.
కత్రీనా కైఫ్ ఇప్పటికే స్టార్ గా ఎదిగినప్పటికీ విక్కీ కౌశల్ క్రమంగా ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో కత్రీనాతో ప్రేమ వ్యవహారం అధికారికంగా బయటపెట్టటం మంచిది కాదని విక్కీ తండ్రి అంటున్నాడట. మరో వైపు, కత్రీనా కూడా గతంలో రణబీర్ తో ఎఫైర్ బాహాటంగానే సాగించింది. అది బెడిసికొట్టాక తేరుకోటానికి చాలా సమయమే పట్టింది. మరి ఈసారి అదే రిస్క్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-