పీయూష్ గోయల్‌తో టీఆర్‌ఎస్‌ నేతల భేటీ

ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు భేటీ కానున్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్‌రావు లు ఈ భేటీలో పాల్గొననున్నారు.

అయితే ఈ భేటీలో తెలంగాన నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతల బృందం కోరనుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో మంత్రులు, అధికారుల బృందంతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles