బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వి పార్ధసారథి

లక్షలాది మంది ఇన్వెస్టర్లను నట్టేటముంచిన కార్వి పార్థసారథిని.. బెంగళూరు పోలీసులు కస్టడీకీ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8న శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పార్థసారధిపై.. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 109 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో పార్ధసారధి, కార్వీ సీఈఓ రాజీవ్ రంజన్, సిఎఫ్‌ఓ కృష్ణహరిపై కేసులు నమోదయ్యాయి.ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని బెంగుళూరు సీసీబీ పోలీసులు.. కోర్టును కోరారు. కస్టడీకి అనుమతించడంతో చంచల్ గూడ జైలు నుంచి నిందితులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

-Advertisement-బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వి పార్ధసారథి

Related Articles

Latest Articles