బీజేపీని వదలం..చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతాం : కేసీఆర్

భారత రైతుల సమస్యల మీద టీఆర్ఎస్‌ లీడ్ తీసుకుంటుంది.. బీజేపీని వదలం.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని వార్నింగ్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్. వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలట అంటూ కేసీఆర్ ఫైర్‌ అయ్యారు. గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలి.. దేశంలో జెండా ఎగరాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం లేపాల్సిందేనన్నారు.

యాసంగిలో వరి వేయలా వద్దా ? చెబితే మా చావేదో మేం చస్తామని తెలిపారు. 2, 3 రోజులు వేచి చూస్తాం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు కేసీఆర్. కేసులకు భయపడే బాపతు కాదు తాము కాదని.. కేంద్రం దిగిరాకపోతే ప్రతీ గ్రామంలో చావు డప్పు కొడుతామని వార్నింగ్‌ ఇచ్చారు. రణం చేయడంలో దేశంలో టీఆర్ఎస్ ను మించిన పార్టీయే లేదన్నారు కేసీఆర్.

Related Articles

Latest Articles