బిజెపి చాలా భిన్నమైంది…ఏ పార్టీకి సమానం కాదు..!

యాదాద్రి జిల్లా : బిజెపి పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనదని… ఏ పార్టీ కూడా బిజెపికి సమానం కాదని..బీజేపీ సీనియర్‌ నేత పి.మురళి మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ దేశాలలో.. అమెరికా, రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు.

read also : తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావు !

ఏ పార్టీకి అమ్ముడు పోకుండా కోవర్టులు లేకుండా టిఆర్ఎస్ పార్టీని ఎదిరించే పార్టీ ఒక బిజెపినే అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో అంకితమై పనిచేస్తున్న పార్టీ బిజెపి అని… తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ తో బీజేపీకీ పొత్తు లేదన్నారు. ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారంటే… అది ప్రధాని, ముఖ్యమంత్రి కలయికనే కానీ, పార్టీల పొత్తు కాదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు వేరు… దేశ విధానాలు వేరని తెలిపారు. నిజాం వారసత్వ రాజకీయ పార్టీలతో లాలూచీపడి… సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపని పార్టీతో బీజేపీ పొత్తు ఉండబోదన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-