బాలీవుడ్ బాద్షా లాంటి ‘ఇంటర్నేషనల్ క్రేజ్’ మన వాళ్లకు ఎప్పుడొస్తుందో…!

బాలీవుడ్ అంటే ఇండియాలో ‘హిందీ సినిమా రంగం’ మాత్రమే! కానీ, బయట ప్రపంచానికి బాలీవుడ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ! మంచికో, చెడుకోగానీ భారతదేశంలోని ఇతర భాషా సినిమా రంగాలు పెద్దగా అంతర్జాతీయ గుర్తింపు పొందలేకపోయాయి. ఇక ఇదే పరిస్థితి మన సినిమా సెలబ్రిటీలది కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి సినిమా రంగాల్లో చాలా మంది నటీనటులున్నా… బాలీవుడ్ బిగ్ షాట్స్ కి దక్కే పబ్లిసిటీ ఇతరులకి దక్కదు. ఇందుకు మంచి ఎగ్జాంపుల్స్ గా రెండు రీసెంట్ రియాక్షన్స్ ని మనం చెప్పుకోవచ్చు…

షారుఖ్ ఖాన్ ని బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అంటూ ఇండియన్స్ కీర్తిస్తుంటారు. అది సబబే కూడా. అయితే, బాలీవుడ్ సూపర్ స్టార్ ఖ్యాతి మన దేశం వారి వరకే పరిమితం కాలేదు. ఇతర దేశాల్లోనూ ఎస్ఆర్కే ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ రానీ వారు, కొద్దిగా వచ్చిన వివిధ దేశాల్లోని విదేశీయులు ఆయన్ని గుర్తిస్తారు. అభిమానిస్తారు కూడా! ఇదంతా మనం సంతోషించాల్సిందే! గర్వపడాల్సింది కూడా! ఎందుకంటే, ఇంగ్లాండ్, అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మన బాద్షాని లెజెండ్ గా అభివర్ణిస్తుంటారు…

కొన్నాళ్ల క్రితం బ్రిటీష్ యాక్టర్ టామ్ హిడిల్ స్టన్ ‘ఇండియా’ అన్న పదం తనకి ఎదురైతే ‘షారుఖ్ ఖాన్’ అంటూ స్పందించాడు! అంతే కాదు, ‘బాలీవుడ్’ అంటే కూడా ‘షారుఖ్ ఖాన్’ అనే ఆయన అన్నాడు! ఇక ఇప్పుడు మరో బ్రిటీష్ సెలబ్రిటీ, యంగ్ సింగర్ ‘హార్వీ’ కూడా షారుఖ్ ని తలుచుకున్నాడు. ఈయనైతే కింగ్ ఖాన్ పేరు చెప్పటమే కాదు… అవసరమైతే తాను బాలీవుడ్ మూవీలో షారుఖ్ కోసం పాట పాడటానికి, తెరపై కనిపించటానికి రెడీ అనేశాడు! బ్రిటన్ సెలబ్రిటీల్లో మన షారుఖ్ ఖాన్ ఫాలోయింగ్ అంతలా ఉంది!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ కి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉండటం, షారుఖ్ లాంటి వారికి ‘అంతర్జాతీయ వీఐపీలు’ అభిమానులు కావటం మనం కూడా సంతోషించాల్సిన విషయమే. కానీ, ఇండియాలోని ఇతర భాషల స్టార్స్, టెక్నీషియన్స్ ఎంతో టాలెంట్, క్రేజ్ ఉండి కూడా వెనుకబడటం… కొంత బాధాకరం! తమిళం, తెలుగు లాంటి సినీ పరిశ్రమల నుంచీ ‘బాహుబలి’ రేంజ్ చిత్రాలు మరిన్ని వస్తే మన ప్రాంతీయ ‘బాద్షాలు’, ‘కింగ్ ఖాన్’లకు కూడా షారుఖ్ లా పేరు వస్తుంది! ఆ దిశగా మన స్టార్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-