నా నాయకుల్ని కేసీఆర్ కొనేసిండు: ఈటల

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు.

ఇక్కడికి వచ్చి నేను అంటే నేను ఎమ్మెల్యే అని అంటున్నారు. ఎవర్రా నువ్వు.. నా మీద వావిలాల ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసా బిడ్డా.. అంటూ ఈటల ఆగ్రహించారు. వావిలాల మండలం కావాలని మధుసూధన్ చారి దగ్గరికి వెల్లి నాలుగు గ్రామాలు ఇవ్వు అన్నాను, కాళ్ళు మొక్కుతా అని అడిగాను. మరి నీ వర్ధన్నపేటలో ఒకరికి అయిన పెన్షన్ ఇచ్చినవా అంటూ ప్రశ్నించారు. మంత్రి అనేటోడు చెబితే పెన్షన్ రావాలి. కాని కేసీఆర్ అక్కడ తాళం వేసి పెట్టిండు. ఇది నిజం అవునో, కాదో ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలను అడగాలని కోరాడు.

దళితుల ఓట్ల కోసం దళిత బంధు పెట్టిండు.. నేను ప్రభుత్వ పథకాలు ఎప్పుడు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఒక్కటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పాను. నయీం అనేటోడు చంపుతా అని బెదిరిస్తే ఏనాడు భయపడ లేదు అని ఈటల తెలిపారు.

ఒక్క నాయకుడు కూడ నా వద్ద లేకుండా కేసీఆర్ కొనుగోలు చేసిండు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితి నేను ఎక్కడ చూడ లేదు. ఈటెల రాజేందర్ అనేటోడు ఉక్కు పాదాలతో ఉద్యమం చేసిండు గుర్తు పెట్టుకో బిడ్డా.. చిన్న బక్క పలచని వాడి మీద ఇన్ని కుట్రలు చేస్తున్నారు. లీడర్ లేకుండా చేయాలని చూస్తున్నారు. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు నిప్పు కణం అన్నారు.

ఈ గెలుపు హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవ గెలుపు అని ఈటల అన్నారు. దళితులపై ప్రేమతో కాదు దళితుల ఓట్ల కోసం దళిత బంధు అంటున్నాడు. నన్ను ఓడించడానికి కాంగ్రెస్ వాడికి డబ్బులు ఇచ్చింది వాస్తవం.. కాకపోతే ముక్కు నేలకు రాస్తా.. నువ్వు రాస్తావా ? అంటూ సవాల్ విసిరాడు. నేను ప్రజల కోసం కష్టపడుతుంటే నన్ను బర్తరఫ్ చేసినవ్.. మర్యాద తప్పితే తొక్కిపడేస్తం ఖబర్ధార్’ అంటూ ఈటల హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-