తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆన్ లాక్ ప్రకియను మొదలు పెట్టాయి. దీంతో అన్ని రంగాలతో పాటుగా ఆలయాలు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. కాగా ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా భక్తుల సందడి కనిపిస్తోంది. సోమవారం 15,973 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 41 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 6,618 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-