టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డికి అదనపు బాధ్యతలు

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి.

ప్రస్తుతం డిప్యుటేషన్‌పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ జవహర్‌రెడ్డికే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో ఆయన తిరుపతి నుంచి అమరావతి నుంచి విధులు నిర్వర్తిస్తారు. అక్కడి నుంచే ఈవో విధులనూ నిర్వర్తించనున్నారు. భారీవర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సీఎం ఆరాతీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జవహర్ రెడ్డిని ఆదేశించారు జగన్.

Related Articles

Latest Articles