‘ఇన్ సైడ్ ఎడ్జ్ 3’… మళ్లీ షూట్ చేస్తారా? లేక పక్కకు పడేస్తారా?

ఇండియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లకి బాగానే అలవాటు పడ్డారు. కానీ, కొన్నాళ్ల క్రితం అంతగా ఆదరణ ఉండేది కాదు. అయినా అప్పట్లోనే చిన్నపాటి సెన్సేషన్ సృష్టించింది ‘ఇన్ సైడ్ ఎడ్జ్’. ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ లను పోలిన ట్విస్టులతో సాగే కథతో ఆడియన్స్ ను మేకర్స్ ఆకట్టుకోగలిగారు. కానీ, ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 2’ ఫస్ట్ సీజన్ అంత మెప్పు పొందలేదు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే, సీజన్ టూలో లాస్ట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ముగిసింది. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా దర్శకనిర్మాతలు ముగింపు పలికారు!
ఫస్ట్ సీజన్ అంతగా సెకండ్ సీజన్ కి రెస్పాన్స్ రాకున్నా ‘ఇన్ సైడ్ ఎడ్జ్’ వెబ్ సిరీస్ మేకర్స్ థర్డ్ సీజన్ కి సై అన్నారు. కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో ఫర్హాన్ అఖ్తర్, రితేశ్ సిద్వాణీ ఈ స్పోర్ట్స్ డ్రామాని నిర్మించారు. వివేక్ ఒబెరాయ్ నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. అతను మూడో సీజన్ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తో కలసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని నీర్వర్యం చేస్తాడట! ఓ భారతీయ క్రికెట్ ఆటగాడు పాక్ తో ఇలా చేతులు కలపటమే పెద్ద కాంట్రవర్సీయల్ పాయింట్! అంతకు మించి ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 3’ అమేజాన్ ప్రైమ్ అధికారులు ఆశించిన స్థాయిలో క్రియేటివ్ గా లేదట! రీసెంట్ గా అమేజాన్ ఇండియా అఫీషియల్స్ సీజన్ 3 మొత్తం ప్రీవ్యూ చూశారట. వారికి చాలా వరకూ నచ్చలేదట. అందుకే, ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 3’ తమ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవ్వాలంటే దాదాపు మొత్తానికి మొత్తంగా రీ షూట్ చేయమన్నారట!

Read More : కోకా కోలా వద్దు, మంచి నీళ్లు ముద్దు అంటోన్న రోనాల్డో, అమృతా రావ్

అమేజాన్ ప్రైమ్ ‘తాండవ్’ లాంటి వెబ్ సిరీస్ ల విషయంలో వివాదాల పాలైంది. అందుకే, ‘ఇన్ సైడ్ ఎడ్జ్’లోని పాకిస్తాన్ యాంగిల్ విషయంలో అనవసరమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదట. అలాగే, ‘ద ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్ లు తమ సబ్ స్క్రైబర్స్ లో అంచనాలు పెంచేసిన నేపథ్యంలో… ‘ఇన్ సైడ్ ఎడ్జ్’ సీజన్ 3 ఔట్ పుట్ అమేజాన్ ప్రైమ్ బ్రాండ్ క్రేజుకి తగిన స్టాయిలో లేదని అఫీషియల్స్ ఫీలయ్యారట! చూడాలి మరి, ‘ఇన్ సైడ్ ఎడ్జ్’ లెటెస్ట్ సీజన్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ దాకా ఎప్పటికి వస్తుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-