ఇక చిరంజీవి అంబులెన్స్ సేవలు!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్​ సేవలను నెలకొల్పాడు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాల‌ని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. త్వరలోనే చిరు దీనిపై ప్రకటన చేయబోతున్నారని సమాచారం. ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘ఆచార్య’ సినిమా త్వరలోనే పునప్రారంభం ప్రారంభం కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-