అటు తండ్రి… ఇటు తనయుడు…

అభిమానానికి హద్దులు ఉండవు. తాము అభిమానించేవారి పేర్లను, బొమ్మలను తమ శరీరంపై పచ్చబొట్లుగా వేయించుకొని మురిసిపోవడమూ కొందరికి ఆనందం ఇస్తుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని కార్తిక్ కూడా అలా ఆనందంలో ఓలలాడుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ ఎమ్.బి.ఏ. చదివాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే మదిలో కొలువైన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ బొమ్మను ట్యాటూగా తన జబ్బపై వేయించుకుని ఆనందించాడు కార్తిక్. ఇందులో విశేషమేముంది? అలా ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తున్నారు కదా! అది కాదు ఇక్కడి ముచ్చట! బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ బొమ్మను కూడా చేతిపై ట్యాటూ వేయించుకోవడం ఇక్కడి విశేషం.

నిజానికి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ నటనలోనూ తండ్రి వారసత్వం తీసుకుంటాడని అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అప్పుడొస్తాడు, ఇప్పుడొస్తాడు అంటూ ఆశగా మోక్షు కోసం ఫ్యాన్స్ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. నిజానికి బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కు, ఈ పాటికి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి ఉంటే, ఈ నాటి టాప్ స్టార్స్ లో తప్పకుండా చోటు సంపాదించి ఉండేవాడు. కానీ, 27 ఏళ్ళు నిండినా మోక్షజ్ఞ నటనలోకి అడుగుపెట్టక పోవడం గమనార్హం! అయినప్పటికీ అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున తమ అభిమాన నటుని తనయుడు తెరపై కనిపించి అలరిస్తాడని ఆశిస్తున్నారు. అలాంటి వారిలో కార్తిక్ కూడా ఉన్నాడు. అందుకే తన అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలోనూ చాటుకున్నాడు. ఇప్పటి దాకా ఒక్క చిత్రంలోనూ కనిపించని మోక్షజ్ఞ అంటే ఇంత అభిమానం ప్రదర్శిస్తున్న ఫ్యాన్స్ లభించడం అతను చేసుకున్న అదృష్టం. దానిని నిలుపుకొంటూ, తనకై ఎదురు చూస్తున్న అభిమానుల కోసమైనా మోక్షజ్ఞ నటనలో అడుగు పెడతాడేమో చూద్దాం.

అటు తండ్రి… ఇటు తనయుడు…
అటు తండ్రి… ఇటు తనయుడు…
అటు తండ్రి… ఇటు తనయుడు…
అటు తండ్రి… ఇటు తనయుడు…
అటు తండ్రి… ఇటు తనయుడు…
అటు తండ్రి… ఇటు తనయుడు…

Related Articles

Latest Articles

-Advertisement-