మలక్‌పేట - మలక్‌పేట

మలక్‌పేట
మలక్‌పేట

మలక్ పేట

నియోజకవర్గాల పునర్విభజన తర్వా మలక్ పేట నియోజకవర్గం పూర్తిగా ఎంఐఎం కు అనుకూలంగా మారింది. దాంతో తొలిసారిగా ఇక్కడ నుంచి మజ్లీస్ తరపున పోటీ చేసిన అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల రెండోసారి కూడా ఎన్నికయ్యారు. ఇక్కడ తన సమీప బిజెపి అభ్యర్ధి వి.వెంకటరెడ్డిని 23263 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వి.ఎన్.రెడ్డికి కేవలం 8320 ఓట్లు వచ్చాయి. గతంలో మీర్ అహ్మద్ ఖాన్ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్.ఇంద్రసేనా రెడ్డి మూడుసార్లు, మల్ రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు గెల్చారు. మల్ రెడ్డి ఒకసారి టిడిపి, మరోసారి కాంగ్రెస్ తరపున గెల్చారు.  సరోజని పుల్లారెడ్డి, మీర్ అహ్మద్ అలీఖాన్, కె.ప్రభాకర్ రెడ్డిలు మంత్రి పదవి నిర్వహించిన వారిలో ఉన్నారు. ప్రభాకర రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా చేశారు. జనతా పార్టీ తరపున గెల్చిన ఈయన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 1989లో ఇక్కడ గెలుపొందిన సుధీర్ కుమార్ కేంద్రమాజీ మంత్రి శివశంకర్ కుమారుడు, ఈయన మరో కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ కూడా ప్రజారాజ్యంలో చేరి నిజామాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ముషీరాబాద్ లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మలక్ పేటలో ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు  జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు,  బిజెపి మూడుసార్లు , మజ్లీస్ రెండుసార్లు, పిడిఎఫ్,  జనతా, టిడిపిలు ఒక్కోసారి గెల్చాయి. 

మలక్ పేట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలను మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం
Activities are not Found
No results found.