జియో.. జూమ్‌ను కాపీ కొట్టిందా..? చ‌ర్య‌లు త‌ప్ప‌వా...?

జియో.. జూమ్‌ను కాపీ కొట్టిందా..? చ‌ర్య‌లు త‌ప్ప‌వా...?

క‌రోనా స‌మ‌యంలో ఇప్పుడు మీటింగులు మొత్తం వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారానే.. స్కూళ్లు తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. క్లాసులు కూడా ఆన్‌లైన్‌లోనే.. ఈ స‌మ‌యంలో.. భారతీయ ఇంటర్నెట్‌ సేవల దిగ్గజం జియో వేల కోట్ల ఆదాయం అవకాశం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం మీద దృష్టి సారించింది. ఆగమేఘాల మీద 'జియో మీట్‌' యాప్‌ను రూపొందించింది. సరిగ్గా వారం క్రితమే భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మిగతా వీడియోకాన్ఫరెన్సింగ్‌ యాప్‌లన్నీ పెయిడ్‌ సర్వీసులు విడిగా ఇస్తుంటే, జియో మీట్‌ అన్ని ఫీచర్లను పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. అయితే, 'జియో మీట్‌' యాప్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ అచ్చం జూమ్‌ లాగే ఉందని ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయ టెలికం దిగ్గజం కాపీ కొట్టడమేంటనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ అంశంపై 'జూమ్‌ వీడియో కమ్యూనికేషన్స్‌ ఇండియా' విభాగం అధిపతి సమీర్‌ రాజె స్పందిస్తూ, అచ్చం తమ యాప్‌ను పోలి ఉండే విధంగా 'జియో మీట్‌' రూపొందించారని ఆరోపించారు. దీనిపై దావా వేసే విషయమై చర్చిస్తున్నట్టు జూమ్ కంపెనీ స్పష్టం చేసింది. దీంతో జియో మీట్‌పై లీగ‌ల్ యాక్ష‌న్ త‌ప్ప‌దా? అనే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.