బ్యాంకుల స్కాంలో ప్రభుత్వ అలసత్వం...

బ్యాంకుల స్కాంలో ప్రభుత్వ అలసత్వం...

దేశీయ బ్యాంకింగ్‌ రంగ సంక్షోభానికి ప్రభుత్వ అలసత్వమే కారణం అని భారత రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వైవి రెడ్డి అన్నారు. డిమాండ్ కింగ్ నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను సుమారు రూ.14,000 కోట్ల మేర రుణవేతనం ఎగ్గొట్టడం వెనుక ప్రభుత్వ అలసత్వం ఉందని తెలిపారు. ఆదివారం జరిగిన ఓ  కార్యక్రమంలో వైవి రెడ్డి మాట్లాడుతూ... వేల కోట్ల రూపాయల పిఎన్‌బి కుంభకోణం డైరెక్టర్ల బోర్డులో ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి మోసాలతో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. పిఎన్‌బి కుంభకోణంలో మెజారిటీ వాటాదారుగా ఉన్న ప్రభుత్వమే భారీగా నష్టపోతుందని వైవి రెడ్డి తెలిపారు. ఇటీవల ఒక బ్యాంక్‌ కుంభకోణం కారణంగా వేల కోట్ల రూపాయలను నష్టపోయింది.. ఆ బ్యాంక్‌ యజమాని అయిన ప్రభుత్వమే భారీగా నష్టపోవాల్సి  వచ్చిందన్నారు. ఈ నష్టాల భారంను పన్ను చెల్లింపుదారులే మోయాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి మోసాల్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో  చెప్పాలని డిమాండ్ చేశారు. పిఎన్‌బి భారీ కుంభకోణంతో ఆర్‌బిఐ విశ్వసనీయత కూడా దెబ్బతిందని వైవి రెడ్డి తెలిపారు.

బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న ఈ సంక్షోభానికి గతంలో పాలించిన యుపిఏ ప్రభుత్వం, ప్రస్తుతం పాలనలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వమూ కారణం అని వైవి రెడ్డి అన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో మొండి పద్దులు భారీగా పెరిగి పోవడానికి యుపిఏ ప్రభుత్వంమే కారణమన్నారు. ఇక ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వ అలసత్వంతో బ్యాంకింగ్‌ రంగంలో భారీ మోసాలు, కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో బ్యాంకుల్లో తమ డిపాజిట్ల చెల్లింపులకు భద్రత ఉంటుందో  లేదోనని ప్రజలు భయపడిపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్‌బిఐ మేల్కొని బ్యాంకులపై తన పర్యవేక్షణను వేగవంతం చేయాలని వైవి రెడ్డి కోరారు. ఇటీవల జరిగిన పిఎన్‌బి భవిష్యత్‌ గురించి ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలన్నారు.