నీ బుగ్గలు పట్టుకోవాలనిపిస్తుంది... 

 నీ బుగ్గలు పట్టుకోవాలనిపిస్తుంది... 

కరోనా లాక్ డౌన్ కారణంగా వచ్చిన విరామ సమయంలో ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటున్న భారత క్రికెటర్లు  ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా  2 సార్లు ప్రపంచ కప్ విజేత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రస్తుత టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ను ట్రోల్ చేసాడు. రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అందులో రోహిత్ రితికాను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అయితే ఆ ఫొటోకు "మీరు ఇష్టపడేదాన్ని ఎల్లప్పుడూ పట్టుకోండి" అని క్యాప్షన్ ఇచ్చాడు రోహిత్. అయితే ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ పోస్ట్ పై యువరాజ్ సింగ్ స్పందిస్తూ తనను ట్రోల్ చేసాడు. మీరు ఇష్టపడేదాన్ని ఎల్లప్పుడూ పట్టుకోండి అనేదానికి సమాధానంగా ''నాకు నీ బుగ్గలు అంటే ఇష్టం, నేను వాటిని పెట్టుకోవచ్చా" అని యువరాజ్ సింగ్ కామెంట్ జత చేసాడు. అయితే రోహిత్ జంటతో యువరాజ్ కు మంచి అనుబంధం ఉంది.  అంతకుముందు, యువరాజ్ సింగ్ యొక్క పదవీ విరమణ వార్షికోత్సవం సందర్భంగా, రోహిత్ శర్మ.. ''కలిసి అద్భుతమైన జ్ఞాపకాలు పంచుకున్నాము, మీరు ఇంకా క్రికెట్ ఆడాల్సింది'' అని తెలిపాడు.