వైకాపా ఎంపీల మళ్ళీ రాజీనామా

వైకాపా ఎంపీల మళ్ళీ రాజీనామా

వైకాపాకు చెందిన అయిదుగురు ఎంపీలు ఇవాళ మళ్ళీ రాజీనామా చేశారు. ఇదివరకే తాము చేసిన రాజీనామాలను ఆమోదించాల్సిందిగా వారు ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరారు. రాజీనామాలపై మరోసారి ఆలోచించుకోవాలని ఆమె కోరారు. రాజీనామా చేయాలని అనుకుంటే.. మరోసారి రాజీనామా పత్రాలను సమర్పించాల్సిందిగా స్పీకర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి ఎంపీలకు. దీంతో అయిదుగురు ఎంపీలు మళ్ళీ రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, పి మిధున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డితో పాటు వరప్రసాద్‌ ఉన్నారు.