వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం 

వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం 

నాయకులను వాడుకొని వదిలేయడం చంద్రబాబు  నైజమని అన్నారు వైసీపీ నేత విజయ సాయి రెడ్డి. అనుభవం ఉన్న దళిత నేత మోత్కుపల్లిని సస్పెండ్ చెయడం దారుణమని... దీన్ని బట్టి చూస్తే... చంద్రబాబు దళిత వ్యతిరేక బుద్ధి బయటపడుతుందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థిలోనైనా చంద్రబాబును అధికారం నుండి దింపాలని మోత్కుపల్లి చెప్పినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.  

అలాగే మోత్కుపల్లి నర్శింహులు మాట్లాడుతూ... రాజకీయంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 'నేను అమ్ముడుపోయానని మెసేజ్ లు పెట్టిస్తున్నావు.. సోషల్ మీడియాలో ప్రచారం చేపిస్తున్నావు' అని చంద్రబాబుపై మండిపడ్డారు. తాను పవన్ కళ్యాణ్, జగన్ తో కలిసి యాత్రల్లో పాల్గొంటానని... నడిచి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకొని చంద్రబాబును ఓడించమని ఆ దేవుణ్ని మొక్కుంటానని మోత్కుపల్లి తెలిపారు.