ఇక నుండి ఏపీ రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి

ఇక నుండి ఏపీ రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతుదినోత్సవంగా ప్రకటించిన ఏపీ సర్కార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని అందుకు సంబందించిన ఉత్తరువుల్లో పేర్కొంది ప్రభుత్వం. రాజశేఖర్ రెడ్డి స్మారకంగా ప్రతేడాది జూలై 8 రైతు దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన ఈ రోజు డిసెంబర్‌ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు.

చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5 వ ప్రధాన మంత్రి, చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలు దారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నరు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము అయిన జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఇక తెలంగాణా విషయానికి వస్తే కేసీఆర్​జన్మదినాన్ని రాబోయే రోజుల్లో రైతు దినోత్సవంగా ఏటా తమ వ్యవసాయ శాఖ తరఫున జరుపుకుంటామని తెలంగాణా మంత్రి నిరంజన్​రెడ్డి కూడా ఆ మధ్య ప్రకటించారు.