ప్రారంభమయిన ప్రజాసంకల్పయాత్ర...

ప్రారంభమయిన ప్రజాసంకల్పయాత్ర...

ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకవడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదలు పెట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా 187వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం విజయ​విహార్‌ కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి బ్రిడ్జి పేట, శ్రీనివాసపురం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. శ్రీనివాసపురంలో జగన్‌ లంచ్‌ విరామం ఉంటుంది. అనంతరం రాజమండ్రి  రైలు కమ్‌ రోడ్‌ బ్రిడ్జి చేరుకోవడంతో ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ వద్ద భారీ బహిరంగసభలో వైఎస్‌ జగన్‌  పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత రైల్వేస్టేషన్‌ చేరుకున్నాక.. ఈ రోజు పాదయాత్ర ముగుస్తుంది.