ఆక్వా రైతులకు జగన్ హామీ...

 ఆక్వా రైతులకు జగన్ హామీ...

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతోన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 171వ రోజుకు చేరింది... పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండగా... ఆకివీడులో ఏర్పాటు చేసిన సభలోజగన్ మాట్లాడుతూ... ఆక్వా రైతులకు పలు హామీలిచ్చారు. చేపలు, రొయ్యల చెరువులకు యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇస్తామని... అనుబంధ ఉపాధి రంగమైన ఫ్యాక్టరీలకు యూనిట్ కరెంట్ రూ.5 లకు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్... దళారీ వ్యవస్థను నియంత్రించి, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఈ హామీలన్నీ పూర్తి చేస్తానని ప్రకటించిన జగన్... నాలుగో ఏడాదిలో ఆక్వాకు మద్దతు ధర కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.