కలివిడిగా... కదులుతూ...

కలివిడిగా... కదులుతూ...

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర విభిన్నంగా సాగుతోంది. అన్ని వర్గాలను ఆకట్టుకోనేవిధంగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు.  ముఖ్యంగా వివిధ వృత్తుల వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ వారి వృత్తుల్లో ఉంటే సాదక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలపై ఆరా తీస్తున్నారు. కమ్మరి, కుమ్మరి, కల్లుగీత, మత్స్యకారులు, ఆటోవాలను సైతం కలిసి... వారి బాధలను వింటున్నారు. 

పాదయాత్ర మధ్యలో జగన్ కల్లుగీత కార్మికులను కలిసి నప్పుడు వారు తమ బాధలను ఆయనతో చెప్పుకున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం అందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పంధించిన జగన్ తమ ప్రభుత్వ రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కల్లుగీసి... కార్మికులను ఉత్సాహపరిచారు. 

మత్స్యకారులతో ఆయన ఎంతో కలివిడిగా నడిచారు. చేపలు పడుతూ ఆ వర్గాలతో కలిసిపోయారు. చెరువులో వలవిసిరి మత్య్సకారులను ప్రోత్సహించారు. తమ ప్రభుత్వం వస్తే.... వలలతో పాటు ఆ వృత్తికి కావాల్సిన మౌళిక సధుపాయాలన్నీ కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ వర్గాల వారు సంతోషం వ్యక్తం చేశారు. 

జగన్ పాదయాత్ర విభిన్న రీతిలో జరుగుతుండటం వైసీపీ వర్గాల్లో ఆనందం అంతా ఇంతా కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కంటే ప్రజాసంకల్ప యాత్ర విభిన్నమని జనం చెప్పుకుంటున్నారు.