జాతీయ స్థాయిలో భేటీలు, పోటోలకు ఫోజులు

జాతీయ స్థాయిలో భేటీలు, పోటోలకు ఫోజులు

రాష్ట్ర సమస్యలను వదిలేసి, పక్క రాష్ట్ర నేతలతో భేటీలవుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలనపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇస్తేస్తారని ఎద్దేవా చేశారు.