వైజాగ్ హీరోలు వీరే...!!

వైజాగ్ హీరోలు వీరే...!!

నిన్న తెల్లవారు జామున విశాఖ జిల్లాలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి స్టెరిన్ వాయువు లీక్ కావడంతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున ఈ సంఘటన జరిగి పోలీసు యంత్రాంగం, డిజాస్టర్ టీమ్ చేరుకోవడానికి అరగంట నుంచి గంట సమయం పట్టింది.  ఈలోగా అక్కడ చాలామంది వ్యక్తులు స్పృహతప్పి పడిపోయారు.  

ఆ గ్రామాల్లోని యువత చాల వేగంగా స్పందించి పిల్లలను, ఆడవాళ్లను, వృద్ధులను ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం నుంచి వీలైనంత ఎక్కువ మందిని వివిధ వాహనాల ద్వారా, కొంతమందిని మోసుకుంటూ వేరే ప్రాంతానికి తరలించారు.  యువత పూనుకొని ఈ పని చేయకుంటే చాలా వరకు ప్రాణనష్టం సంభవించేది.  యువత చేసిన గొప్ప పనిని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.  యువత తలచుకుంటే ఎలాంటి కష్టమైనా పనినైనా సాధించగలదు అని మరోమారు నిరూపించారు.  దేశానికీ దిక్సూచిగా నిలుస్తున్నారు.