21 రోజులు బిగ్ బాస్ ఆడేద్దాం - కరోనాను కట్టడి చేద్దాం... 

21 రోజులు బిగ్ బాస్ ఆడేద్దాం - కరోనాను కట్టడి చేద్దాం... 

బిగ్ బాస్ హౌస్ గురించి అందరికి తెలుసు.  బిగ్ బాస్ హౌస్ లో ఉండే వ్యక్తులు 100 రోజులపాటు ఆ ఇంట్లోనే ఉండాలి.  10 నుంచి 15 మంది సభ్యులు ఇచ్చిన కొద్దిపాటి వనరులతో  అడ్జెస్ట్ కావాలి.  వనరులను మితంగా వాడుకుంటూ  100 రోజులపాటు సర్వైవ్ కావాలి.  లగ్జరి లైఫ్ ను లీడ్ చేసే వ్యక్తులకు ఇది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  కానీ, ఈ టాస్క్ లో గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ కూడా అధికంగా ఉంటుంది.  

ఇప్పుడు అదే విధమైన టాస్క్  దేశంలోని ప్రజలందరికి వచ్చింది.  ఇది 21 రోజుల టాస్క్. 21 రోజులపాటు ఉంటున్న ఇంటిని బిగ్ బాస్ హౌస్ గా మార్చుకోండి.  ఇంట్లో ఉన్న సభ్యులు ఇంట్లో ఉన్న వనరులను  మితంగా వాడుకోవాలి.  ఉన్న కొద్దిపాటి డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో ఈ 21 రోజుల్లో నేర్చుకోండి.  ఇంట్లో ఉన్న కూరగాయలు, ఇతర సరుకులను కూడా జాగ్రత్తగా వాడుకోవాలి.  21 రోజులపాటు అన్నింటిని పరిమితంగా వాడుకుంటూ, బయటకు వెళ్లకుండా సర్వైవ్ కాగలిగితే... కరోనాపై విజయం సాధించినట్టే అవుతుంది.  జీవితంలో ఎదుగుదలకు ఎలాంటి ప్లాన్ వేసుకోవాలో ఈ 21 రోజుల్లో మీరు నేర్చుకోవచ్చు.  కొత్త కొత్త విషయాలను ఇంట్లో ఉంది నేర్చుకునేందుకు ఇది సదవకాశం.  వృధాగా టీవీ చూస్తూ కాలక్షేపం చేయకుండా, రాబోయే గడ్డు రోజులను ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకుంటూ అడుగులు వేస్తె తప్పకుండా విజయం సాధించవచ్చు.