యూనిస్ కోచ్ మెడపై కత్తి పెట్టడానికి కారణం.. 

యూనిస్ కోచ్ మెడపై కత్తి పెట్టడానికి కారణం.. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ యొక్క వాదనపై స్పందించడానికి నిరాకరించింది. మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కు అల్పాహారం చేస్తునప్పుడు కొన్ని బ్యాటింగ్ కు సంబంధించిన సలహాలు ఇచ్చినందుకు తన గొంతుకు కత్తి పెట్టాడు అని ఫ్లవర్ తెలిపాడు. అయితే ఈ విషయం పై పీసీబీ అధికారికంగా స్పందించలేదు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే... 2016 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బ్రిస్బేన్‌లో జరిగిన ఈ సంఘటన స్నేహపూర్వకంగా జరిగిందని... యూనిస్ సరదాగా వెన్న కోసే కత్తిని తీసుకొని తాను అల్పాహారం చేస్తున్న సమయం లో సలహా ఇవ్వవద్దని చెప్పాడట! ఇక ప్రస్తుతం పాక్ బ్యాటింగ్ కోచ్  అయిన యూనిస్ కూడా గ్రాంట్ వ్యాఖ్యల పై ఏ విధంగా స్పందించలేదు.