ఏపి క్యాబినెట్ లోకి కిడారి శ్రావణ్

ఏపి క్యాబినెట్ లోకి కిడారి శ్రావణ్

ఏపిలో సిఎం చంద్రబాబు క్యాబినెట్ చివరి విస్తరణలో కిడారి శ్రావణ్‌కుమార్‌ కు స్థానం దక్కింది. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేసిన కిడారి శ్రావణ్, మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు. కేవలం 28ఏళ్ల వయసులోనే మంత్రి కాబోతున్నారు. ఉభయ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందుతున్నారు శ్రావణ్. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఇలా క్యాబినెట్ లోకి వచ్చింది ఇయనే.  ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో... చట్టసభల్లో సభ్యుడు కాకున్నా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కి కల్పిస్తున్నారు.  ఈలోగానే సాధారణ ఎన్నికలు వస్తాయి గనుక అరకు నుంచి శ్రావణ్‌నే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపాలని సిఎం చంద్రబాబు ఫ్లాన్.