అన్నింటిది ఓ దారి... యెస్ బ్యాంకుది మరోదారి... !!

అన్నింటిది ఓ దారి... యెస్ బ్యాంకుది మరోదారి... !!

స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే.  కరోనా వలన ప్రజలు భారీ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వలన ఆరువేలమంది వరకు మరణించిన సంగతి తెలిసిందే.  కరోనా ప్రభావం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపైనే కాకుండా,  ఆర్ధికవ్యవస్థపై కూడా పడింది.  ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. 

ఉదయం స్టాక్ ఎక్స్చేంజి ప్రారంభమైన వెంటనే భారీ నష్టాలు చవిచూశాయి.  భారీ నష్టాలతో ప్రారంభమైన నిమిష నిమిషానికి కుంగిపోతున్నాయి.  కోట్లాది రూపాయల సంపద ఆవిరైపోతున్నది.  అంతేకాదు, అన్ని కంపెనీల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.  కానీ, నష్టాల్లో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ షేర్లు మాత్రం సడెన్ గా పుంజుకోవడం విశేషం.  నష్టాల్లో ఉన్న ఈ బ్యాంక్ షేర్లు 31.31% లాభపడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.  ఈ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ బ్యాంకులు ముందుకు వస్తుండటంతో ఆ బ్యాంక్ షేర్లు లాభాలబాట పడుతున్నాయి.