నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం

నేడు యడ్యూరప్ప ఒక్కరే  ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా  ఇవాళ  ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆహ్వానించిన విషయం తెలిసిందే. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. బల నిరూపణ పూర్తయ్యే వరకు క్యాబినెట్‌ను విస్తరించే అవకాశం కూడా లేదు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు నిరసిస్తున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు.